ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించాలి : సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో ఇకపై ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Advertisement
Update:2025-01-03 20:47 IST

రాష్ట్రంలో ఇకపై ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆర్‌ఆర్‌ఆర్‌, అర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవే ప్రాజెక్టులపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త గ్రామపంచాయతీలతో సహా ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాల్సిందే. ఇందుకు సంబంధించి విడతల వారీగా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.. ఇక ఏ గ్రామానికి రోడ్డు లేదు అనే మాట వినబడొద్దు అని పేర్కొన్నారు.

నాగ్‌పూర్‌ – విజయవాడ కారిడార్‌ కు సంబంధించి తెలంగాణ జిల్లాల్లో అసంపూర్తిగా మిగిలిన భూసేకరణ ప్రక్రియను సంక్రాంతిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ శాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.అటవీ, ఆర్అండ్‌బీ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అటవీశాఖ పరిధిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, సీఎస్‌ శాంతికుమారి, ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.

Tags:    
Advertisement

Similar News