కేంద్ర మంత్రికి ఆగంతుకుడు బెదిరింపు..రూ.50 లక్షలు డిమాండ్
రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ మొబైల్ ఫోన్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఆగంతకులు రూ.50 లక్షలు డిమాండ్ చేశారు
కేంద్ర రక్షణ శాఖ మంత్రి సంజయ్ సేథ్‌కు ఆగంతుకుడు మొబైల్ ఫోన్‌కు మెసేజ్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర మంత్రి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న సాయంత్రం రూ. 50 లక్షల దోపిడీకి సంబంధించిన బెదిరింపు మేసేజ్ వచ్చిందని పోలీసులు ధృవీకరించారు. ఆ వెంటనే ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారిని కలిసి దీని గురించి చెప్పానన్నారు. డీసీపీ, ఇతర సీనియర్ పోలీస్ అధికారులు ఈ అంశంపై ఎంక్వరీ చేస్తున్నారని తెలిపారు.
అలాగే జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తాతో కూడా స్వయంగా మాట్లాడి ఫిర్యాదు చేసినట్లు కేంద్ర తెలిపారు. కాగా, ఇలాంటి బెదిరింపులపై వీలైనంత త్వరగా స్పందించాలని కేంద్ర మంత్రి సేథ్ తెలిపారు. ‘ఈ విషయాన్ని రిపోర్ట్ చేయడం నా బాధ్యత. నేను అలా చేశా. ప్రధాని మోదీ మార్గదర్శకత్వం నుంచి ప్రేరణ పొందా. నా పనిపై, ప్రాంతాలను సందర్శించడం, ప్రజలను కలవడంపై దృష్టి పెడుతున్నా. ఎప్పటిలాగే పోలీసులు తమ పనిని సమర్థవంతంగా చేస్తున్నారు’ ఆయన అన్నారు