శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ నెంబర్-1

హైదరాబాద్ లో ట్యాంక్‌ బండ్‌ నుంచి ప్రారంభమైన పోలీసుల ర్యాలీ.. లిబర్టీ, అబిడ్స్‌, చార్మినార్‌, తెలుగుతల్లి విగ్రహం మీదుగా అంబేద్కర్‌ విగ్రహం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాలు, అగ్నిమాపక శకటాలను ప్రదర్శించారు.

Advertisement
Update:2023-06-04 14:54 IST

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడోరోజైన నేడు సురక్షా దినోత్సవం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో శాంతి భద్రతల స్థాపనపై అవగాహన కల్పించే విధంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్వరాష్ట్రంలో పోలీస్ శాఖ ఎంతో పురోగతి చెందిందని అన్నారు హోం మంత్రి మహమూద్‌ అలీ. శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ పోలీస్ వ్యవస్థ మొదటి స్థానంలో ఉందన్నారు.హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు పోలీసుల ర్యాలీని ఆయన ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, డీజీపీ అంజనీ కుమార్‌ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




సీఎం కేసీఆర్ చొరవతో..

సీఎం కేసీఆర్‌ పోలీస్ శాఖకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చారని తెలిపారు మంత్రి మహమూద్ అలీ. పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారని వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ పోలీసులు మొదటి స్థానంలో ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌, పోలీసు శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు.



 

హైదరాబాద్ లో ట్యాంక్‌ బండ్‌ నుంచి ప్రారంభమైన పోలీసుల ర్యాలీ లిబర్టీ, అబిడ్స్‌, చార్మినార్‌, తెలుగుతల్లి విగ్రహం మీదుగా అంబేద్కర్‌ విగ్రహం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాలు, అగ్నిమాపక శకటాలను ప్రదర్శించారు.



 

జిల్లాల్లో కార్యక్రమాలు..

అటు మహబూబ్‌ నగర్‌ లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పోలీసుల బైక్‌ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మహబూబాబాద్‌ లో మంత్రి సత్యవతి రాథోడ్‌ పోలీసుల బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. నల్లగొండలో ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి, పెద్దపల్లిలో ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ పుట్టా మధు, భూపాలపల్లిలో గండ్ర వెంకట రమణారెడ్డి పోలీసు బైక్‌ ర్యాలీ, కవాతు ప్రారంభించారు.




Tags:    
Advertisement

Similar News