ఠారెత్తిస్తున ఎండలు, వడగాల్పులు....ఇళ్ళలోంచి బైటికి రావద్దంటూ అధికారుల సూచన‌

తెలంగాణలో ఈ రోజు ఉదయం నుంచే పలు చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఏపీ లో కూడా కొన్ని జిల్లాల్లో 43 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదయ్యిందని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప పగటి పూట ఇళ్ళలోంచి బైటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement
Update:2023-04-11 13:57 IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఏప్రెల్ లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీ లో ఏకంగా ఆరు జిల్లాల్లోని 27 మండలాల్లో వడగాల్పులు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. అల్లూరి సీతారామ జిల్లా, కాకినాడ, అనకాపల్లి, ఏలూరు జిల్లాలోని పలు మండలాల్లో ఈ రోజు తీవ్రంగా వడగాలులు వీస్తున్నాయి. రేపటి ఉంచి మరో 5 జిల్లాల్లో కూడా వడగాల్పులుంటాయని ఐఎండీ వెల్లడించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందని అధికారులు తెలిపారు.

తెలంగాణలో కూడా ఈ రోజు నుండి నాలుగు రోజుల పాటు ఎండలు మండనున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 13వ తేదీ వరకూ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నాలుగు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. పలు జిల్లాలకు ప్రత్యేకంగా సూచనలు జారీ చేసింది. 11,12, 13 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించింది.

తెలంగాణలో ఈ రోజు ఉదయం నుంచే పలు చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఏపీ లో కూడా కొన్ని జిల్లాల్లో 43 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదయ్యిందని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప పగటి పూట ఇళ్ళలోంచి బైటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News