తెలంగాణ 'సమ్మర్ అభ్యాస' సక్సెస్..

మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో.. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియంలలో వారానికోసారి ప్రాక్టీస్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. శుక్రవారానికి అనుకున్న సిలబస్ పూర్తి చేసి, ప్రతి శనివారం పరీక్ష పెడతారు.

Advertisement
Update:2023-05-14 18:37 IST

వేసవి సెలవల్లో ప్రైవేట్ స్కూల్ పిల్లలకు రకరకాల యాక్టివిటీలుంటాయి. ప్రభుత్వ స్కూల్ పిల్లలు మాత్రం సమ్మర్ హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే తిరిగి స్కూల్ మొదలయ్యేనాటికి వారిలో అదే స్థాయిలో అభ్యసనా శక్తి ఉంటుందని చెప్పలేం. అందుకే తెలంగాణ ప్రభుత్వం 'సమ్మర్ అభ్యాస' అనే కార్యక్రమం మొదలు పెట్టింది. ఈ నెల 13నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. మొబైల్ యాప్ ద్వారా పిల్లలకు హోమ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఈ నెల 13 నుంచి జూన్ 10వరకు ప్లే స్టోర్ లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది, దీని ద్వారా బోధన చేస్తారు. ఈ యాప్ అందుబాటులోకి రాగానే విద్యార్థులంతా దీనిపై ఆసక్తి చూపించారని అంటున్నారు అధికారులు. ఈ యాప్ ద్వారా తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని చెబుతున్నారు.

తెలంగాణ పాఠశాల విద్యా శాఖ డిజిటల్ హోమ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు వేసవి శిక్షణ ఇస్తోంది. ఈ ప్రోగ్రామ్‌ లో 4 నుండి 10వ తరగతి వరకు ప్రమోట్ అయిన విద్యార్థులకోసం యాప్ ద్వారా కొత్త ఏడాది చెప్పబోయే సిలబస్ పరిచయం చేస్తారు. ఇంతకు ముందు చదివిన తరగతి ప్రశ్నలకు సమాధానాలు రాబడతారు. ఇలా వారిలో లెర్నింగ్ యాక్టివిటీని కొనసాగిస్తారు.

మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో.. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియంలలో వారానికోసారి ప్రాక్టీస్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. శుక్రవారానికి అనుకున్న సిలబస్ పూర్తి చేసి, ప్రతి శనివారం పరీక్ష పెడతారు, ఆదివారం వారికి పూర్తిగా సెలవు ఇస్తారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకోసం రూపొందించిన ఈ ప్రోగ్రామ్ పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అధికారులు. ఇప్పటికే పిల్లలు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ అందుతోందని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News