ప్రాణాలు తీసిన పతంగులు.. ఎంతమంది చనిపోయారంటే
హైదరాబాద్‌లోని బోరబండ రహమత్‌నగర్‌లో 23ఏళ్ల కపిల్‌దేవ్ పతంగి ఎగరేయడానికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. సోమవారం రాత్రి 7.30 గంటలకు కపిల్‌దేవ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు.
సంక్రాంతి పండుగపూట పలుచోట్ల విషాద ఘటనలు జరిగాయి. పతంగులు ఎగరేస్తూ కరెంట్ షాక్‌తో ఇద్దరు, ఐదో ఫ్లోర్ నుంచి కిందపడి మరొకరు చనిపోయారు. దీంతో మృతుల ఇళ్లల్లో పండుగ పూట విషాదం నెలకొంది.
కరెంట్ వైర్లకు చిక్కుకున్న గాలిపటాలను తీస్తుండగా షాక్ తగిలి ఇద్దరు బాలురు చనిపోయారు. యాప్రాల్‌కు చెందిన భువన్ సాయి (13) ఆదివారం సాయంత్రం గాలిపటం ఎగరేస్తుండగా అది కరెంట్ వైర్లలో చిక్కుకుంది. పతంగిని స్టీల్ రాడ్డుతో తీసేందుకు ప్రయత్నించడంతో విద్యుత్ షాక్ తగిలి స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. బాలుడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
కాటేదాన్‌లోని గణేశ్‌నగర్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. వివేక్(13) ఇంటిపై పతంగి ఎగరేస్తుండగా అది కరెంట్ వైర్లలో చిక్కుకుంది. కైట్‌ను ఇనుపరాడ్డుతో తీసేందుకు ప్రయత్నించడంతో షాక్ కొట్టి చనిపోయాడు.
హైదరాబాద్‌లోని బోరబండ రహమత్‌నగర్‌లో 23ఏళ్ల కపిల్‌దేవ్ పతంగి ఎగరేయడానికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. సోమవారం రాత్రి 7.30 గంటలకు కపిల్‌దేవ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఐదో అంతస్తులో పతంగులు ఎగరేశాడు. కొద్దిసేపటి తర్వాత మెట్లు దిగుతూ లిఫ్ట్ కోసం తీసిన గుంతలో పడిపోయాడు. తీవ్ర గాయాలు అవడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. కపిల్‌దేవ్ మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదుతో మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.