ఆందోళనకరంగా స్టాక్ మార్కెట్.. కేంద్రం జవాబు చెప్పాలి - కల్వకుంట్ల కవిత

ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం కాకముందే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సెబీ చీఫ్ మధాబి పూరిబుచ్ తక్షణం ఇందుకు పూనుకోవాలన్నారు.

Advertisement
Update:2023-01-28 16:59 IST

 స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అదానీ గ్రూపు అక్రమాలు వెలుగులోకి వచ్చిన తర్వాత షేర్ మార్కెట్ లో మార్పులు తీవ్రంగా ఉన్నాయి. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఇతర కంపెనీల షేర్లలో తగ్గుదల, ఒడిదుడుకులు సర్వత్రా తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయి అని కవిత అన్నారు.

ఇలా జరగడానికి కారణమెవరు ? ఎవరు బాధ్యత వహిస్తారు ? ప్రతి భారతీయుడికి జవాబు కావాలి. భారత ప్రజలకున్న అన్ని సందేహాలకు జావాబు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర‌ ప్రభుత్వంపై ఉంద‌న్నారు.

ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం కాకముందే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సెబీ చీఫ్ మధాబి పూరిబుచ్ తక్షణం ఇందుకు పూనుకోవాలన్నారు. ఇందువల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన లక్షల మంది పెట్టుబడిదారులకు ప్రభుత్వం మద్దతుగా నిలబడాలని, వారితో ప్రభుత్వం తరపున మాట్లాడాలని క‌విత డిమాండ్ చేశారు.

► Read latest Telangana News and Telugu News

► Follow us on Facebook , Twitter & Google News

Tags:    
Advertisement

Similar News