తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ

కొరియన్‌ యూనివర్శిటీ సాంకేతిక భాగస్వామ్యంతో తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ యూనివర్శిటీ ఏర్పాటు విషయంలో ఆనంద్ మహీంద్రాని సలహాలు, సూచనలు అడిగారు.

Advertisement
Update:2024-08-18 12:54 IST

తెలంగాణలో ఓవైపు రుణమాఫీ కాలేదని రచ్చ జరుగుతోంది. సిక్స్ గ్యారెంటీస్ ఏవంటూ ప్రతిపక్షం సూటిగా ప్రశ్నిస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలను పట్టించుకోకుండా మూసీ బ్యూటిఫికేషన్, ఫ్యూచర్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ అంటూ గ్యారెంటీలతో సంబంధం లేని విషయాలను తెరపైకి తెచ్చి మరింత ప్రచార చేస్తోంది. తాజాగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

ఒలింపిక్స్ టార్గెట్ గా..

2028లో లాస్ ఏంజిలస్ లో జరగబోతున్న ఒలింపిక్స్ టార్గెట్ గా క్రీడాకారుల్ని సిద్ధం చేసేందుకు ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మిస్తామని, ఫ్యూచర్‌ సిటీలోని స్పోర్ట్స్‌ హబ్‌లో దీన్ని ఏర్పాటుచేస్తామని అంటున్నారు. 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 12కి పైగా స్పోర్ట్స్‌ అకాడమీలతో ఈ యూనివర్శిటీ అందుబాటులోకి రాబోతోంది. హకీంపేటలోని స్పోర్ట్స్‌ స్కూల్, గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను దీనికోసం పరిశీలిస్తున్నారు.

దక్షిణ కొరియా స్ఫూర్తితో..

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి దక్షిణకొరియా పర్యటనకు వెళ్లారు. అక్కడ కూడా ఇలాంటి స్పోర్ట్స్ యూనివర్శిటీ ఉంది. పారిస్ ఒలింపిక్స్ లో సౌత్ కొరియా మొత్తం 32 పతకాలు సాధించగా.. అందులో 16 మెడల్స్ ని యూనివర్శిటీ విద్యార్థులే సాధించారు. దీంతో తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటుకి సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. కొరియన్‌ యూనివర్శిటీ సాంకేతిక భాగస్వామ్యంతో తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈ యూనివర్శిటీ ఏర్పాటు విషయంలో ఆనంద్ మహీంద్రాని సలహాలు, సూచనలు అడిగారు సీఎం రేవంత్ రెడ్డి. 



Tags:    
Advertisement

Similar News