దేశ రక్షణ బాధ్యత యువతపైనే ఉంది : సీఎం రేవంత్‌రెడ్డి
దేశ రక్షణ బాధ్యత యువతపైనే ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విజ్ఞాన్ వైభవ్’ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి సీఎం పాల్గొన్నారు.;
వ్యవసాయంతోపాటు అన్ని రంగాల్లో సైన్స్ ముఖ్యపాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తాను కూడా కొన్నాళ్లు సైన్స్ అధ్యాపకుడిగా పని చేశానని గుర్తు చేశారు. సర్ సీవీరామన్ ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ క నుగొన్నారని నోబెల్ గ్రహిత రామన్ గౌరవార్థం ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. గచ్చిబౌలిలో జరిగిన విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. సైన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులు గమనించాలని సూచించారు. ఇంతటి విద్యార్థి సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం సంతోషంగా ఉందని తెలిపారు. మానవ పరిణామాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు అధ్యయనం చేయాలని సూచించారు. ప్రస్తుతం వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో సైన్స్ ముఖ్యపాత్ర పోషిస్తోందని సైన్స్ వల్ల కలిగే ఉపయెగాలను విద్యార్థులు గమనించాలని సూచించారు. ఇన్నోవేషన్, దేశ ప్రగతిలో విద్యార్థులతో కీలకపాత్ర అని నూతన ఆవిష్కరణలకు భారత్ హబ్ గా మారుతున్నదని చెప్పారు.
రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేందుకు మేము ప్రయత్నిస్తామని అందుకోసం కేంద్ర ప్రభుత్వ సహకారం, మద్దతు అవసరం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని స్వాతంత్ర్యానికి ముందు ఆ తర్వాత కూడా హైదరాబాద్‌లో బీడీఎల్, హెచ్‌ఎచ్‌ఎల్, మిథాని, డీఆర్‌డీఓ వంటి అనేక సంస్థలు దేశ రక్షణ కోసం ఉత్పత్తి రంగంలో విశేషంగా పని చేస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. దేశ రక్షణ రంగానికి హైదరాబాద్, బెంగళూరు ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి. గతంలో మీతో చర్చించినట్టుగా హైదరాబాద్-బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలని రాజ్ నాథ్ సింగ్ ను సీఎం కోరారు. తద్వారా భారీగా పెట్టుబడులు వస్తాయని రాకెట్ తయారీ సహా ఆకాశ మార్గం (స్కై రూట్) వంటి స్టార్టప్‌లు అభివృద్ధి చెందుతాయన్నారు. భారతదేశ రక్షణ బాధ్యత యువతీ యువకులపై ఉందని ఆయన అన్నారు.