క్రిస్మస్ సందర్భంగా కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు
మాజీ సీఎంతో బీఆర్‌ఎస్ సీనియర్ నేత రాజీవ్ సాగర్ భేటీ
Advertisement
క్రిస్మస్ పండుగ సందర్భంగా మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నేత రాజీవ్ సాగర్ బుధవారం ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజీవ్ సాగర్ ను కేసీఆర్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బిషప్ నెహేమియా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో క్రిస్టియన్ జేఏసీ నాయకుడు సోలోమన్ రాజు, న్యూ లైఫ్ చర్చెస్ బిషనప్ నెహేమియా, క్యాథలిక్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ లియో లూయిస్ తదితరులు ఉన్నారు.
Advertisement