రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన స్పీకర్
కోమటి రెడ్డి రాజగొపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఇవ్వాళ్ళ తన రాజీనామా లేఖను స్పీకర్ కు అందజేయగా స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించారు.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆమోదించారు. సోమవారంనాడు స్పీకర్ ను కలిసిన రాజగోపాల్ రెడ్డి స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా లేఖను అందజేశారు. తన రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించినట్టు రాజగోపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేసినట్టు వెల్లడించారు. తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడటానికి ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం ఎన్ని సార్లు ప్రయత్నించినా లభించలేదని ఆయన వాపోయారు. మునుగోడు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాననే బాధతోనే పదవీ త్యాగం చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి న్యాయం చేయలేకపోయిన రాజగోపాల్ రెడ్డి రేపు బీజేపీ తరపున గెల్చినా ఏ విధంగా న్యాయం చేస్తారనే ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం లేదు.