దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చాలి.. సోనియా గాంధీ వీడియో సందేశం

మీకు మంచి ప్రభుత్వం లభించాలి. నన్ను సోనియమ్మ.. అని పిలిచి చాలా గౌరవం ఇచ్చారు. ఈ ప్రేమ, అభిమానాలకు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను.

Advertisement
Update:2023-11-28 16:53 IST

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరికొద్ది సేపట్లో సమయం ముగిసిపోనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ‌ రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఒక వీడియో సందేశం విడుదల చేశారు. అందరం కలిసి దొరల తెలంగాణని.. ప్రజా తెలంగాణగా మార్చుకుందామని పిలుపునిచ్చారు.

'నేను మీ వద్దకు రాలేకపోతున్నా. మీరు నా మనసుకు చాలా దగ్గరగా ఉంటారు. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తవడం చూడాలనుకుంటున్నా.. దొరల తెలంగాణని.. ప్రజా తెలంగాణగా మనమందరం కలసి మార్చాలి. తెలంగాణ ప్రజల కలలు సాకారం అవ్వాలి.

మీకు మంచి ప్రభుత్వం లభించాలి. నన్ను సోనియమ్మ.. అని పిలిచి చాలా గౌరవం ఇచ్చారు. ఈ ప్రేమ, అభిమానాలకు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు నా విన్నపం ఒక్కటే. మార్పు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండి' అని సోనియా గాంధీ సందేశం ఇచ్చారు.

సోనియా గాంధీ కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచార బాధ్యతలను తమ భుజాలపై వేసుకుని ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ప్రచారానికి రాలేని పరిస్థితుల్లో సోనియా గాంధీ తెలంగాణ ప్రజలనుద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News