శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పాములు కలకలం

శంషాబాద్‌ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి. ఎయిర్‌పోర్టులో పాములు పట్టుబడటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

Advertisement
Update:2024-11-25 11:22 IST

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పాములు కలకలం రేపాయి. ఇవాళ ఉదయం బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమాన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు.అనంతరం ఆ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకాక్‌ నుంచి పాములు తీసుకొస్తున్న వారిని సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారని అనుమానం వ్యక్తమవుతున్నది.

వారిద్దరు పథకం ప్రకారంమే పాములను తీసుకొచ్చారా అనే కోణంలో దర్యాప్తుచేస్తున్నారు. అవి చాలా విషపూరితమైనవిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. మహిళా ప్రయాణికుల వద్ద పాములు కనిపించడంతో.. ఎయిర్ పోర్టులో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. 2 పాములను అధికారులు స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News