యువజన సర్వీసులు, టూరిజం సెక్రటరీగా స్మితా సబర్వాల్‌

జీహెచ్‌ఎంసీ పూర్తిస్థాయి కమిషనర్‌ గా ఇలంబర్తి

Advertisement
Update:2024-11-11 20:13 IST

యువజన సర్వీసులు, టూరిజం, కల్చర్‌ సెక్రటరీగా స్మితా సబర్వాల్‌ ను నియమించారు. జీహెచ్‌ఎంసీ పూర్తి స్థాయి కమిషనర్‌ గా ఇలంబర్తికి పోస్టింగ్‌ ఇచ్చారు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీగా అప్రాదాన్య పోస్టులో కొనసాగుతున్న స్మితా సబర్వాల్‌ కు ప్రాధాన్యత ఉన్న పోస్టింగ్‌ ఇచ్చారు. అక్కడ పని చేస్తున్న ఎన్‌. శ్రీధర్‌ ను బదిలీ చేశారు. ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ ఇ. శ్రీధర్‌ ను బీసీ వెల్ఫేర్‌ సెక్రటరీగా నియమించారు. పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ స్త్రీశిశు సంక్షేమ శాఖ సెక్రటరీగా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌, జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జీ కమిషనర్‌ ఇలాంబర్తిని జీహెచ్‌ఎంసీకి పూర్తి స్థాయి కమిషనర్‌గా నియమించారు. మైన్స్‌ అండ్‌ జియాలజీ సెక్రటరీ సురేంద్రమోహన్‌ ను ట్రాన్స్‌ పోర్ట్‌ కమిషనర్‌ గా బదిలీ చేశారు. ఫైనాన్స్‌, ప్లానింగ్‌ సెక్రటరీ కృష్ణభాస్కర్‌ ను ట్రాన్స్‌ కో సీఎండీగా బదిలీ చేశారు, డిప్యూటీ సీఎం స్పెషల్‌ సెక్రటరీగా ఆయన అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు. వెయిటింగ్‌ లో ఉన్న చెరువు హరికృష్ణకు ప్రొబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌ గా నియమించారు. వెయిటింగ్‌ లో ఉన్న శ్రీజనను పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ గా నియమించారు. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ కృష్ణాదిత్యను ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీగా బదిలీ చేశారు. లేబర్‌ కమిషనర్‌ గా సంజయ్‌ కుమార్‌ కు పోస్టింగ్‌ ఇచ్చారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ను జేఏడీ (కో ఆర్డినేషన్‌) సెక్రటరీగా నియమించారు. ఆ స్థానంలో ఇంకా ఎవరికి పోస్టింగ్‌ ఇవ్వలేదు.



Tags:    
Advertisement

Similar News