కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ప్రకటించిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడి వాటి అమలులో తడబడుతున్న దశలో బీఆర్ఎస్ నుంచి ఓ రేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. తాజాగా కేటీఆర్ మరోసారి ఆరు గ్యారెంటీలపై సెటైర్లు పేల్చారు. ఇన్వర్టర్లు, పవర్ బ్యాంక్ లు అంటూ ఆయన ఓ ఆరు ఐటమ్స్ లిస్ట్ పెట్టారు. ఈ ఆరింటినీ మీ దగ్గర భద్రపరచుకోండి అంటూ కరెంటు కోతలపై అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.
ఆరు గ్యారెంటీలు ఇవే..
1. ఇన్వర్టర్లు
2. చార్జింగ్ బల్బ్ లు
3. టార్చ్ లైట్లు
4. క్యాండిల్స్
5. జనరేటర్లు
6. పవర్ బ్యాంక్ లు
"ప్రజలారా గుర్తు పెట్టుకోండి ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ కాదు. మే 13న పార్లమెంట్ ఎన్నికల్లో తెలివైన నిర్ణయం తీసుకుని ఓటు వేయండి.." అని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు కేటీఆర్.
కాంగ్రెస్ పాలనలో ఇన్వర్టర్లకు డిమాండ్ పెరిగిందని, జనరేటర్ల సేల్స్ పెరిగాయని, ఇక చార్జింగ్ లైట్ల వ్యాపారం కూడా జోరందుకుందని.. ఇటీవల సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. వీటికి కొనసాగింపుగా కేటీఆర్ పేర్కొన్న ఆరు గ్యారెంటీలు మరింత వైరల్ గా మారాయి.