తెలంగాణ ఎమ్మెల్యేలపై తక్కువ వ్యతిరేకత.. IANS సీ ఓటర్ సర్వే..!

ఛత్తీస్‌గడ్‌లో పరిస్థితి మాత్రం విచిత్రంగా ఉంది. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. దాదాపు 44 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్ర‌జ‌లంతా ఆగ్రహంతో ఉన్నారు.

Advertisement
Update:2023-09-13 08:04 IST

ఈ ఏడాది ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు సంబంధించి ఓ షాకింగ్‌ సర్వే వెల్లడైంది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలో మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి తక్కువ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని సర్వే తేల్చింది. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కేవలం 27.6 శాతం మంది మాత్రమే వ్యతిరేకత వ్యక్తం చేయగా.. మిజోరాంలో 41.2 శాతం మంది ప్రజలు సిట్టింగ్‌లపై కోపంతో ఉన్నారు. ఈ మేరకు IANS సీ ఓటర్ సర్వే.. ఓ రిపోర్టు విడుదల చేసింది.

ఇక ఛత్తీస్‌గడ్‌లో పరిస్థితి మాత్రం విచిత్రంగా ఉంది. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. దాదాపు 44 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్ర‌జ‌లంతా ఆగ్రహంతో ఉన్నారు. ఐదు రాష్ట్రాల్లో అత్యంత వ్యతిరేకత ఎదుర్కొంటుంది ఛత్తీస్‌గఢ్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేలే. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ముఖ్యమంత్రి భూపేష్‌ భగేల్‌ మాత్రం అత్యంత ఎక్కువ ప్రజాదరణతో మిగతా నాలుగు రాష్ట్రాల సీఎంల కంటే మెరుగైన స్థితిలో ఉన్నారు.

తెలంగాణ తర్వాత రాజస్థాన్‌లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలు తక్కువ ఆగ్రహంతో ఉన్నారు. రాజస్థాన్‌లో కేవలం 28.3 శాతం మంది ప్ర‌జ‌లు మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఈ జాబితాలో మధ్యప్రదేశ్‌ సిట్టింగ్‌ల ఎమ్మెల్యేలపై 40.4 శాతం ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News