తెలంగాణలో థియేటర్లు బంద్‌.. ఎందుకంటే..!

స్టార్ హీరోల సినిమాలేవి లేక‌పోవ‌డంతో ప్రేక్షకులు థియేట‌ర్‌కు వెళ్లట్లేదు. సింగిల్ స్క్రీన్లకు ప్రేక్షకులు రాక‌పోవ‌డంతో థియేటర్ ఓనర్లు భారీ న‌ష్టాల‌ను చూస్తున్నారు.

Advertisement
Update:2024-05-15 13:13 IST

సినిమాతో జనానికి ఆహ్లాదం, ఆనందం. పనుల్లో బిజీబిజీగా గడిపేవాళ్లకు సినిమా కాస్త రిలీఫ్‌ అని చెప్పొచ్చు. వీకెండ్ వచ్చిందంటే చాలామంది రిలాక్స్ అవ్వ‌డానికి సినిమాలకు వెళుతుంటారు. ఇంకొంతమంది తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అంటే థియేటర్లకు క్యూ కడుతారు. అయితే కొన్ని నెల‌లుగా టాలీవుడ్‌లో పెద్ద సినిమాలేవి రిలీజ్ కాలేదు. ఓ పక్క ఎన్నికలు, మరోపక్క ఐపీఎల్ ఉండటంతో పెద్ద సినిమాలను సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు.

స్టార్ హీరోల సినిమాలేవి లేక‌పోవ‌డంతో ప్రేక్షకులు థియేట‌ర్‌కు వెళ్లట్లేదు. సింగిల్ స్క్రీన్లకు ప్రేక్షకులు రాక‌పోవ‌డంతో థియేటర్ ఓనర్లు భారీ న‌ష్టాల‌ను చూస్తున్నారు. ఈ క్రమంలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు తాత్కాలిక విరామం ప్రకటించాయి. శుక్రవారం నుంచి పది రోజులపాటు షోలు వేయొవద్దని నిర్ణయించాయి. క‌రోనా లాక్‌డౌన్ టైంలో దేశమంతటా థియేట‌ర్‌లు మూతపడిన విష‌యం తెలిసిందే. అప్పుడు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది సినీ ఇండస్ట్రీనే. అలాంటి పరిస్థితే మ‌ళ్లీ తెలంగాణలో వచ్చింది.

Tags:    
Advertisement

Similar News