బొగ్గు ఉత్పత్తిలో చరిత్ర సృష్టించిన సింగరేణి

ఎన్నడూ లేనంతగా డిశంబర్ లో 67.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించామని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఇది డిసెంబర్ 2021లో సాధించిన దానికంటే 19 శాతం అధికం.

Advertisement
Update:2023-01-03 17:23 IST

Singareni has created history in coal productionతెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల చరిత్రలోనే అత్య‌ధిక ఉత్పత్తి సాధించిన నెలగా 2022 డిశంబర్ నెల నిలిచిపోతుంది. ఎన్నడూ లేనంతగా డిశంబర్ లో 67.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించామని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ తెలిపారు.

ఇది డిసెంబర్ 2021లో సాధించిన దానికంటే 19 శాతం అధికం. కంపెనీ మరో ఆల్-టైమ్ రికార్డ్‌ను కూడా నెలకొల్పింది. డిశంబర్ లో ప్రతి రోజుకు సగటున 2.18 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగింది.

మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన శ్రీధర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 80 రోజుల్లో తమ‌ లక్ష్యాన్ని చేరుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. అందుకోసం రోజుకు 2.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా తగ్గకుండా అధికారులు చూడాలని ఆయన కోరారు. బొగ్గు ఉత్పత్తిని ఈ స్థాయిలో కొనసాగించినట్లయితే సంస్థ రూ.34,000 కోట్లకు పైగా టర్నోవర్‌తో పాటు అత్యధిక లాభాలను నమోదు చేయగలదని చెప్పారు.

మణుగూరు, కొత్తగూడెం, రామగుండం రీజియన్ ల నుంచి అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి జరగడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News