జి-20 అతిథులకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి బ్యాడ్జీలు

ప్రస్తుతం సిల్వర్ ఫిలిగ్రి మరోసారి టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. కరీంనగర్ నుంచి పంపించిన బ్యాడ్జీలు జి-20 సదస్సులో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. సిల్వర్ ఫిలిగ్రి స్టాల్ కూడా సెంటరాఫ్ అట్రాక్షన్ కానుంది.

Advertisement
Update:2023-09-08 13:19 IST

ఢీల్లీలో రేపటినుంచి ప్రారంభం కాబోతున్న జి-20 సమావేశాలకు సంబంధించి తెలంగాణ కళాకారులకు ఓ అరుదైన గౌరవం లభించింది. ఈ సదస్సుకు హాజరయ్యే వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ప్రతినిధులకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి కళాకారులు రూపొందించిన అశోకచక్రం ఆకారంలో ఉన్న వెండి బ్యాడ్జీలు అందించబోతున్నారు. మొత్తం 200 వెండి బ్యాడ్జీలను ఇక్కడ తయారు చేయించారు. వీటిని ఇటీవలే ఢిల్లీకి పంపించారు. అంతేకాదు, సమావేశాలు జరిగే ప్రాంతంలో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి స్టాల్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్‌ కళాకారుడు ఎర్రోజు అశోక్‌ ఈ బ్యాడ్జీలను తయారు చేశారు.

సిల్వర్ ఫిలిగ్రి అంటే..?

కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి కళకు దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణలోని కరీంనగర్ దీనికి పుట్టిల్లు. కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ, గోల్కొండ నవాబులు ఈ కళను ఆదరించారు. స్వర్ణకార వృత్తిలో ఉన్నవారు, ఇతర వృత్తుల్లో ఉన్నవారు కూడా ఈ సిల్వర్ ఫిలిగ్రి నేర్చుకున్నారు. వారిలో అతికొద్ది మంది మాత్రమే దీన్ని కొనసాగిస్తున్నారు. స్వచ్ఛమైన వెండితో తయారు చేసిన తీగలతో అతి సున్నితంగా, తేలికగా ఉండే వస్తువులను తయారు చేయడమే సిల్వర్ ఫిలిగ్రి. పూర్తిగా చేతితో తయారు చేసే ఈ కళకు అత్యంత ఏకాగ్రత అవసరం. ఇప్పటికీ ఇతర దేశాల్లో ఈ సిల్వర్ ఫిలిగ్రి వస్తువులను అపురూపంగా చూస్తుంటారు. ఇతర దేశాల్లో కూడా వీటికి డిమాండ్ బాగా ఎక్కువ.

జ్ఞాపికలుగా..

సిల్వర్ ఫిలిగ్రి గురించి తెలుసుకున్నవారు కచ్చితంగా ఆ కళాఖండాలను తమ ఇళ్లలో భద్రపచుకుటుంచారు. ఎంతోమంది విదేశీ, స్వదేశీ అతిథులకు వీటిని ప్రభుత్వాలు బహుమతులుగా అందిస్తుంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంలో అతిథులుగా వచ్చిన అప్పటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం జగన్ కి కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సిల్వర్ ఫిలిగ్రి కళాకృతులను అందించారు. తాజాగా ఈ సిల్వర్ ఫిలిగ్రి కళ జి-20 లో హైలైట్ కాబోతోంది.

జి-20 సదస్సులో సిల్వర్ ఫిలిగ్రి

ప్రస్తుతం సిల్వర్ ఫిలిగ్రి మరోసారి టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. కరీంనగర్ నుంచి పంపించిన బ్యాడ్జీలు జి-20 సదస్సులో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. సిల్వర్ ఫిలిగ్రి స్టాల్ కూడా సెంటరాఫ్ అట్రాక్షన్ కానుంది.

Tags:    
Advertisement

Similar News