ఎస్సీ వర్గీకరణ తేలేదాక నోటిఫికేషన్లు లేవు..తేల్చిచెప్పిన సీఎం రేవంత్‌

తెలంగాణలో 60 రోజుల వరకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకూడదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు.

Advertisement
Update:2024-10-09 16:55 IST

తెలంగాణలో మరో రెండు నెలలు నోటిఫికేషన్ రిలీజ్ చేయకూడదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ పై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోపే రిపోర్టు ఇవ్వాలని.. మంత్రులు, అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. రిపోర్టు ఇచ్చాకే నూతన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. 24 గంటల్లో కమిషన్ కు కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలన్నారు. పాత నోటిఫికేష్లనకు ఎస్సీ వర్గీకరణ వర్తించదని..ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్ట్ తీర్పు నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ పలుమార్లు సమావేశమయింది. ఉత్తమ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయగా.. ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని సబ్ కమిటీ తీర్మానించింది. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్, సబ్ కేబినెట్ సభ్యులంతా సమావేశమయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరో రెండు నెలల వరకు తెలంగాణలో కొత్త నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేదు. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగాలు తీవ్ర నిరాశలో ఉన్నారు.

ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి చదువుతున్నము.. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మరో 60 రోజులు ఆగాల్సిందే నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశం తేలేదాక రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వబోమని సీఎం రేవంత్‌ రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఎల్‌ బీ స్టేడియంలో డీఎస్సీలో ఎంపికైన కొత్త టీచర్లకు బుధవారం ఆయన నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఏకపభ్య కమిషన్‌ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఎస్సీలను ఏ, బీ, సీ, డీ లుగా వర్గీకరణ చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు పై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ ఇప్పటికే నాలుగు పర్యాయాలు సమావేశమై చర్చించి, వర్గీకరణ అమలు కోసం ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసిందన్నారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సుల మేరకు ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. సీఎం ప్రకటనతో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ అమలులోనూ జాప్యం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    
Advertisement

Similar News