TGO అధ్యక్షురాలు మమతకు షాక్‌..బదిలీ వేటు.!

మమత 2010 నుంచి GHMCలోనే పనిచేస్తున్నారు. గతంలో జూబ్లిహిల్స్‌కు బదిలీ చేయగా.. 24 గంటల వ్యవధిలోనే శేరిలింగంపల్లి సర్కిల్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు.

Advertisement
Update:2024-01-06 17:35 IST

బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ సంఘం అధ్యక్షురాలు మమతకు షాకిచ్చింది రేవంత్ సర్కార్. GHMC జోనల్ కమిషనర్లకు స్థానచలనం కల్పించింది. ఇందులో భాగంగా కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా ఉన్న మమతపై బదిలీ వేటు పడింది. ఆమెకు నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్ మేనెజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. మమత స్థానంలో కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా IAS అభిలాష అభినవ్‌ను నియమించింది.

మమత 2010 నుంచి GHMCలోనే పనిచేస్తున్నారు. గతంలో జూబ్లిహిల్స్‌కు బదిలీ చేయగా.. 24 గంటల వ్యవధిలోనే శేరిలింగంపల్లి సర్కిల్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో 2010 నుంచి 2018 వరకు ఆమె బాధ్యతలు నిర్వహించారు. 2018 నుంచి కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ఆమె కొనసాగింపుపై గతంలో కాంగ్రెస్‌ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

ఇక మమతతో పాటు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డిని బదిలీ చేసింది ప్ర‌భుత్వం. ఆయన డిప్యూటేషన్‌ను రద్దు చేసి.. చేనేత, జౌళీ శాఖ డైరెక్టర్‌గా పాత చోటుకే పంపించింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషర్‌గా IAS స్నేహ శబరీష్‌ను నియమించింది ప్రభుత్వం.

Tags:    
Advertisement

Similar News