మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా శంభీపూర్ రాజు

మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి మొదట తన కొడుకు భద్రారెడ్డిని పోటీ చేయించాలని మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రయత్నాలు చేశారు.

Advertisement
Update:2024-03-13 07:51 IST

మల్కాజ్‌గిరి లోక్‌సభ అభ్యర్థిని ఖరారు చేసింది బీఆర్ఎస్‌ పార్టీ. ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజును మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇప్పటికే సోషల్‌మీడియాలో శంభీపూర్ రాజుకు కార్యకర్తలు, సన్నిహితుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి మొదట తన కొడుకు భద్రారెడ్డిని పోటీ చేయించాలని మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రయత్నాలు చేశారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో తన ప్రతిపాదనను విరమించుకున్నారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు స్పష్టం చేశారు. దీంతో ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలించిన కేసీఆర్.. శంభీపూర్‌ రాజును అభ్యర్థిగా నిర్ణయించారని సమాచారం.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పరిధిలోని అసెంబ్లీ స్థానాలన్నింటిని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 2001లో టీఆర్ఎస్‌ పార్టీతో రాజకీయరంగ ప్రవేశం చేశారు శంభీపూర్‌ రాజు. 2016లో రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించారు. కేసీఆర్, కేటీఆర్‌లకు అత్యంత సన్నిహితుడిగా శంభీపూర్‌ రాజుకు పేరుంది. ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News