తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు

దాదాపు రెండున్నర గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది. కేబినెట్‌లో చర్చించిన అంశాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వివరించారు.

Advertisement
Update:2024-03-12 19:52 IST

అర్హులైన పేదలకు త్వరలోనే తెల్ల రేషన్‌ కార్డులు ఇవ్వాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ దాదాపు రెండున్నర గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది. కేబినెట్‌లో చర్చించిన అంశాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వివరించారు.

కేబినెట్ నిర్ణయాలు ఇవే -

- కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదం

- ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సహా 16 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

- ఈబీసీలకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు

- రేషన్‌కార్డు లేకుండా ఆరోగ్య శ్రీ అమలుకు కసరత్తు

- రెండు రోజుల్లో 93 శాతం మందికి రైతుబంధు

- కాళేశ్వరం అవినీతిపై న్యాయవిచారణకు కమిటీ

- విచారణ కమిటీ ఛైర్మన్‌గా జస్టిస్ పినాకిని చంద్రఘోష్‌

- కాళేశ్వరం అవినీతిపై నివేదికకు వంద రోజుల గడువు

- విద్యుత్ కొనుగోళ్లపైనా మరో కమిటీ

- భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ ప్రాజెక్టులు, విద్యుత్‌ కొనుగోళ్ల అంశంపై విచారణ

- విచారణ కమిటీ ఛైర్మన్‌గా రిటైర్డ్ జడ్జి ఎల్.నరసింహరెడ్డి

- ORR చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెట్లు

- వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం

- మొదటి విడతలో 4 లక్షల 56 వేల ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం

Tags:    
Advertisement

Similar News