సమగ్ర కుటుంబ సర్వే పై ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు

సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సేకరిస్తున్న సమాచారంతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే కూనంనేని అన్నారు

Advertisement
Update:2024-11-10 18:04 IST

రాష్ట్రంలో చేపట్టిన కుల గణన, ఇంటింటి సర్వేలో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో సేకరిస్తున్న మొబైల్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాలు, ఆధార్ కార్డు తదితర వివరాలు సైబర్ నేరగాళ్ళ చేతికి చిక్కితే ఇబ్బంది అవుతుందని కూనంనేని అన్నారు. అలా జరగకుండా పకడ్బంది చర్యలు తీసుకోవాలన్నారు.

అవసరం లేని వివరాలను ఈ సర్వేలో సేకరిస్తున్నారని, కొన్ని చోట్ల ఏ పార్టీ అని కూడా అడుగుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వ్యక్తిగత గోప్యత పాటించాలని, వాటిని బహిర్గత పర్చాల్సిన అవసరం లేదన్నారు. కోర్టులు చెప్పిన విషయాన్ని కూనంనేని గుర్తు చేశారు. కుల గణనలో సేకరిస్తున్న ప్రశ్నలకు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నదని.. అవసరం లేని వాటిని ఉపసంహరించుకోవాలని సూచించారు. తక్షణమే ఈ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించి స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి సాంబశివరావు డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News