మనసు చంపుకుని పని చేస్తున్నా..హైడ్రా కమిషనర్ సంచలన వ్యాఖ్యలు

బఫర్ జోన్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించడంతో పాటు, చెరువుల్లోకి కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే తమ బాధ్యత అని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ తెలిపారు.

Advertisement
Update:2024-11-22 20:30 IST

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతల విషయంలో మానవత్వంతో ఆలోచిస్తే సమాజం మొత్తం బాధపడుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. కొన్నిసార్లు మనసు చంపుకుని పని చేస్తున్నానని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.'అనుమతులు లేకుంటే పెద్దలవా, పేదలవా అని ఆలోచించం.. కూల్చడమే. ఇకపై కబ్జాలు జరగకుండా చూస్తాం. హైడ్రా పనితీరు వల్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. వారే చెరువులు, నాలాల కబ్జాలను అడ్డుకుంటున్నారు' అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హైడ్రా కమిషనర్ మాట్లాడారు.

సంగారెడ్డి‘‘అమీన్‌పూర్‌ చెరువు తూములు మూసివేయడం వల్లే లేఅవుట్లు మునిగాయి. ఎఫ్‌టీఎల్‌ లెవెల్ పరిగణనలోకి తీసుకొని చెరువులు సర్వే చేయిస్తాం. తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే హైడ్రా కూల్చివేసింది. అనుమతులు లేకుండా ఉన్న ఇళ్లు.. పెద్దవాళ్లవైనా, పేదలవైనా కూల్చక తప్పదు. కొంతమందిపై చర్యలు తీసుకోవడం వల్లే హైడ్రా చేసే పని అందరికీ తెలిసింది. ప్రజల్లో ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్లపై అవగాహన వచ్చింది.. దీనిపై చర్చ కూడా జరుగుతోంది. అక్రమ నిర్మాణాల విషయంలో.. మానవత్వంతో ఆలోచిస్తే సమాజమంతా బాధపడాల్సి వస్తుంది

Tags:    
Advertisement

Similar News