సికింద్రాబాద్‌లో భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ పట్టివేత

సికింద్రాబాద్ బోయిన్పల్లి లో 1500 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు

Advertisement
Update:2024-11-17 17:45 IST

హైదరాబాద్ నగరంలో కల్తీ పదార్థాలు తయారు చేసే ముఠా పెరిగిపోయింది. తాజాగా సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో భారీ స్థాయిలో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 1500 కేజీల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ని అధికారులు సీజ్ చేశారు. అల్లంపేస్ట్‌కు బదులు ప్రమాదకరమైన రసానాలు వాడుతుంది ఆసిమ్. ఇక హైదరాబాదు లోని ప్రముఖ హోటల్స్ కి అల్లం వెల్లుల్లి పేస్టు సరఫరా చేస్తున్న ఆసిమ్.. ప్రతినిత్యం 15 టన్నుల అల్లం వెల్లుల్లి పేస్టుని ప్రముఖ హోటల్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మార్కెట్లో కుళ్ళిపోయిన వెల్లుల్లి తీసుకువచ్చి రసాయనాలు కలిపి పేస్ట్ తయారు చేస్తుంది ఆసిమ్. దాంతో సోనీ గార్లిక్ యజమాని ఆసిమ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు టాస్క్ ఫోర్స్ అధికారులు. మార్కెట్లో కుళ్ళిపోయిన వెల్లుల్లి తీసుకువచ్చి రసాయనాలు కలిపి పేస్ట్ తయారు చేస్తుంన్నడు ఆసిమ్ అనే వ్యక్తి.

దాంతో సోనీ గార్లిక్ యజమాని ఆసిమ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు టాస్క్ ఫోర్స్ అధికారులు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ను నగరంలో చాలా రెస్టారెంట్ల, హోటల్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లకు పంపిణీ చేసినట్లు తెలిసింది. సీటీలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లే వీరు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. బోయిన్‌పల్లి, రాజరాజేశ్వరి నగర్‌లో ఖార్కానాలో 'సోనీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌' పేరిట దందా కొనసాగుతోంది. 4లక్షల 50 వేలు విలువ చేసే మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. వీరు తయారీలో కెమికల్స్, కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లి వాడుతున్నట్లు తెలిసింది. ఈ అల్లం, వెల్లుల్లితో చేసిన పదార్థాలు తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కల్తీ అల్లం వెల్లుల్లు తయారు చేస్తున్న 8మందిని పోలీసులు పట్టుకోని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News