Secunderabad to Visakhapatnam: వందే భారత్ రైలు 16న ప్రారంభం... ఛార్జీలు, ఇతర‌ వివరాలు

Vande Bharat Express Secunderabad to Visakhapatnam Ticket Price: ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు రైలు నడుస్తుంది. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం మధ్య 699 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి 8 గంటల 30 నిమిషాలు పడుతుంది. సికింద్రాబాద్ జంక్షన్ నుండి, రైలు విశాఖపట్నానికి 15:00 గంటలకు బయలుదేరుతుంది.

Advertisement
Update:2023-01-14 18:01 IST

సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జనవరి 16 న ప్రారంభంకానుంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే మొదటి బ్లూ అండ్ వైట్ కాలర్ రైలు. ఇది దేశంలో 8వ వందే భారత్ రైలు కాగా దక్షిణ భారతదేశంలో రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. పొందింది.

ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు రైలు నడుస్తుంది. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం మధ్య 699 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి 8 గంటల 30 నిమిషాలు పడుతుంది. సికింద్రాబాద్ జంక్షన్ నుండి, రైలు విశాఖపట్నానికి 15:00 గంటలకు బయలుదేరుతుంది. ఇది 23:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం నుండి రైలు 05:45 గంటలకు బయలుదేరి 14:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ రైలు సికింద్రాబాద్ జంక్షన్ నుండి విశాఖపట్నం మధ్య వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

ఈ రైలులో 14 AC చైర్ కార్ కోచ్లు,రెండు ఎగ్జిక్యూటివ్ AC చైర్ కార్ కోచ్లుంటాయి. 1,128 మంది ప్రయాణీకులు ప్రయాణం చేయవచ్చు.

20833/20834 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ బ్లూ అండ్ వైట్ కలర్ రైలు టికెట్‌ను ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS), ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

IRCTC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న 20833 విశాఖపట్నం (VSKP) నుంచి సికింద్రాబాద్ (SC) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ధరలు (సాధారణ బుకింగ్)

AC చైర్ కార్ (CC) ఛార్జీ:

విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు – రూ 1,720

విశాఖపట్నంనుండి రాజమండ్రికి - రూ 625

విశాఖపట్నం నుండి విజయవాడ జంక్షన్ వరకు - రూ 960

విశాఖపట్నంనుండి ఖమ్మం వరకు – రూ 1,115

విశాఖపట్నం నుండి వరంగల్ - రూ 1,310

ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ (EC) ఛార్జీ:-

విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు – రూ 3,170

విశాఖపట్నం నుండి రాజమండ్రికి – రూ 1,215

విశాఖపట్నం నుండి విజయవాడ జంక్షన్ వరకు - రూ 1,825

విశాఖపట్నం నుండి ఖమ్మం వరకు – రూ 2,130

విశాఖపట్నం నుండి వరంగల్ - రూ 2,540

20834 సికింద్రాబాద్ (SC) నుంచి విశాఖపట్నం (VSKP) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ధరలు;

AC చైర్ కార్ (CC) ఛార్జీ:

సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు – రూ 1,665

సికింద్రాబాద్ నుండి వరంగల్ వరకు - రూ 520

సికింద్రాబాద్ నుండి ఖమ్మం వరకు - రూ 750

సికింద్రాబాద్ నుండి విజయవాడ జంక్షన్ వరకు - రూ 905

సికింద్రాబాద్ నుండి రాజమండ్రి వరకు – రూ 1,365

ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ (EC) ఛార్జీ:-

సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు – రూ 3,120

సికింద్రాబాద్ నుండి వరంగల్ వరకు - రూ 1,005

సికింద్రాబాద్ నుండి ఖమ్మం వరకు - రూ 750

సికింద్రాబాద్ నుండి విజయవాడ జంక్షన్ వరకు - రూ 1,775

సికింద్రాబాద్ నుండి రాజమండ్రి వరకు – రూ 2,485

క్యాటరింగ్ ఛార్జీ:

AC చైర్ కార్ (CC) ఛార్జీలు - రూ. 364

ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ (EC) ఛార్జీలు - రూ. 419

Tags:    
Advertisement

Similar News