ఇకపై ప్రైవేట్ జూ.కాలేజీల ఆటలు సాగవు.. ప్రకటనల పరిశీలనకు కమిటీ

ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తమ స్టూడెంట్స్ కు సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలనుకుంటే అడ్వర్టైజ్మెంట్స్ తో పాటు దరఖాస్తును కమిటీకి సమర్పించాలి.

Advertisement
Update:2023-05-09 07:14 IST

తెలంగాణలో ప్రైవేట్ జూనియర్ కాలేజీల ప్రకటనల పరిశీలనకు ఇంటర్ మీడియట్ బోర్డు కమిటీని నియమించింది. తమ విద్యార్ధుల ఉత్తీర్ణతలు, ర్యాంకులకు సంబంధించి ప్రకటనలు ఇవ్వాలనుకునే కాలేజీలు ముందుగా బోర్డు ఆఫ్ ఇంటర్ మీడియట్ నియమించిన కమిటీ అనుమతి తీసుకోవాలి. కమిటీ అనుమతి తీసుకున్న తర్వాతనే మీడియాలో ప్రకటనలివ్వాలని తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ అండ్ సెక్రెటరీ నవీన్ మిత్తల్ తెలిపారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం అడ్వర్టైజ్మెంట్ పద్ధతిని, కోడ్ ను అనుసరిస్తున్నాయా? లేదా? అనే విషయాన్ని కమిటీ పరిశీలిస్తుంది. కమిటీలో బోర్డులోని సీనియర్ అధికారులైన కంట్రోలర్ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్, ఎగ్జామినేషన్స్, అడ్మినిస్ట్రేషన్, అకాడమిక్ విభాగాల జాయింట్ సెక్రెటరీలు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సభ్యులుగా ఉన్నారు.

ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తమ స్టూడెంట్స్ కు సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలనుకుంటే అడ్వర్టైజ్మెంట్స్ తో పాటు దరఖాస్తును కమిటీకి సమర్పించాలి. కమిటీ ఆ దరఖాస్తును, అడ్వర్టైజ్మెంట్ ను పరిశీలించి, అవరసరమైతే మార్పులు సూచించి అనుమతిస్తుంది. అప్పుడు మాత్రమే పబ్లిష్ చేసుకోవాలని ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. జేఈఈ, నీట్ ఎంట్రన్స్ ల్లో ర్యాంకులు సంపాదించిన ఇతర కాలేజీ విద్యార్థులను తమ కాలేజీ విద్యార్థులుగా ప్రైవేట్ కాలేజీలు చెప్పుకుంటూ ప్రకటనలిస్తున్నాయి. ప్రకటనలతో తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. తమ కాలేజీల్లో అడ్మిషన్స్ పెంచుకుంటున్నాయి. వీటిపై బోర్డు ఆఫ్ ఇంటర్ మీడియట్ కు పలు ఫిర్యాదులందాయి. దీంతో ఈ కమిటీని వేసినట్టు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రెటరీ నవీన్ మిత్తల్ వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News