రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌.. తెలంగాణ స్థానాలపై ఉత్కంఠ..!

అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండగా.. బిహార్‌, మహారాష్ట్రలో ఆరేసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్‌, మధ్యప్రదేశ్‌లో ఐదేసి స్థానాలు ఖాళీ కానున్నాయి.

Advertisement
Update:2024-01-29 15:05 IST

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది.

తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్‌లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్‌, జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ల పదవీకాలం ముగియనుంది. ఇక ఏపీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్ర స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏపీలో దాదాపు 3 స్థానాలు వైసీపీకే దక్కే అవకాశాలుండగా.. తెలంగాణలో ఎవరికీ దక్కుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇందులో భాగంగానే తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేసే ప్రయత్నాలు జరగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వరుస సమావేశాలు ఈ కోవలోకే వస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండగా.. బిహార్‌, మహారాష్ట్రలో ఆరేసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్‌, మధ్యప్రదేశ్‌లో ఐదేసి స్థానాలు ఖాళీ కానున్నాయి.

Tags:    
Advertisement

Similar News