రూ.10 కోట్లు హాం ఫట్.. బ్యాంకులోనూ లేదు గ్యారంటీ
19 మంది పేరిట నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు 2కోట్ల 80లక్షల రూపాయలు కాజేశాడు. రామంతపూర్ బ్రాంచ్ నుంచి సైదులు ట్రాన్స్‌ఫర్ అయ్యి కొత్త మేనేజర్ రావడంతో వీళ్లు చేసిన మోసం బయటపడింది.
హైదరాబాద్‌లోని రామంతపూర్ SBI బ్రాంచ్ మేనేజర్ సైదులు మోసాలు తెలిస్తే అవక్కవ్వాల్సిందే. గతంలో రామంతపూర్ SBI బ్రాంచ్ మేనేజర్‌గా చేసిన సైదులు.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఖాతాదారులకు తెలియకుండా రూ.2కోట్ల 80లక్షలు లేపేశాడు. ఈ కేసు విచారణ జరుపుతున్న పోలీసులకు మరో షాకింగ్ విషయం తెలిసింది. సూర్యాపేట SBI బ్రాంచ్‌లో పనిచేసినప్పుడు కూడా ఇదే తరహా మోసానికి పాల్పడి సుమారు రూ.10 కోట్లు కొట్టేసినట్లు గుర్తించారు.
షేక్ సైదులు గతంలో హైదరాబాద్‌లోని రామంతపూర్ SBI బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో గంగ మల్లయ్య అనే మరో ఎంప్లాయ్ సాయంతో ఖాతాదారులకు తెలియకుండా వాళ్ల డాక్యుమెంట్లు తీసుకుని లోన్‌లు అప్లై చేశాడు. 19 మంది పేరిట నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు 2కోట్ల 80లక్షల రూపాయలు కాజేశాడు. రామంతపూర్ బ్రాంచ్ నుంచి సైదులు ట్రాన్స్‌ఫర్ అయ్యి కొత్త మేనేజర్ రావడంతో వీళ్లు చేసిన మోసం బయటపడింది. సైదులుపై కొత్త మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్య, కొడుకుతో కలిసి మేనేజర్ సైదులు పరారయ్యాడు. గాలింపు మొదలుపెట్టిన పోలీసులు గతంలోనూ ఇలాంటి మోసాలు చేశాడా? అనే కోణంలో విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సూర్యాపేటలోనూ ఇదే తరహా మోసం చేసి రూ. 10 కోట్లు కొట్టేసినట్లు తేలింది.