అందంగా ఉన్నావ్.. నేను చెప్పిన ప్లేస్‌కు రావాలి

సీఐ ఆమె కేసును పక్కనబెట్టి, ఆమెపై దృష్టి పెట్టారు. "నువ్వు అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్‌కు రావాలి" అంటూ మెసేజ్‌లు పెట్టాడు. అంతేకాక ఆమెతో అసభ్యకరంగా చాట్ చేశాడు.

Advertisement
Update:2024-07-20 20:09 IST

సనత్ నగర్ సీఐ పురేందర్ రెడ్డిపై వేటు పడింది. ఆయన్ని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో సీఐ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విమర్శలు వచ్చాయి. బాధిత మహిళ సైబరాబాద్ సీపీని ఆశ్రయించింది. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సీఐ పురేందర్‌రెడ్డిపై వేటేశారు.

ఓ కేసు విషయంలో బాధిత మహిళ సనత్‌ నగర్‌ సీఐ పురేందర్‌రెడ్డి వద్దకు వెళ్లింది. అయితే సీఐ ఆమె కేసును పక్కనబెట్టి, ఆమెపై దృష్టి పెట్టారు. "నువ్వు అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్‌కు రావాలి" అంటూ మెసేజ్‌లు పెట్టాడు. అంతేకాక ఆమెతో అసభ్యకరంగా చాట్ చేశాడు. ఈ చాటింగ్‌ వివరాలన్నింటినీ బాధిత మహిళ సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతికి అందించింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితురాలికి న్యాయం చేయకపోగా వేధించడంపై సీపీ సీరియస్‌ అయ్యారు. పురేంద‌ర్‌రెడ్డిని సనత్ నగర్ సీఐ బాధ్యతల నుంచి తప్పిస్తూ సీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News