బీఆర్‌ఎస్ హయాంలోనే హోంగార్డులకు జీతాలు పెంచాము : శ్రీనివాస్ గౌడ్

చనిపోయిన హోమ్ గార్డులకు 10 లక్షల ఏక్షగ్రేషియా రిటైర్ అయిన హోమ్ గార్డులకు బెనిఫిట్స్ ఇవ్వాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Advertisement
Update:2024-12-07 16:23 IST

తెలంగాణలో హోమ్ గార్డుల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎదో ఉద్దరిస్తారు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతారు అనుకున్న కానీ నిన్న 79 రూపాల జీతం పెంచి 1000 రూపాల వేతనం పెంచామని గొప్పలు చెప్తున్నారు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడే హోమ్ గార్డులకు ప్రభుత్వ భీమా సౌకర్యం కల్పించడం జరిగిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 9 వేల జీతం ఉండేది. ప్రతి సంవత్సరం 1000 రూపాయల జీతం పెంపు ఉంటుంది అని అప్పడే చెప్పామని ఆయన అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హోమ్ గార్డులకు రూ. 20 వేల జీతం పెంచడం జరిగింది. తరువాత వారికి పీఆర్సీ 30 శాతం పెంచడం జరిగిందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

చనిపోయిన హోమ్ గార్డులకు 10 లక్షల ఏక్షగ్రేషియా ఇవ్వండి. రిటైర్ అయిన హోమ్ గార్డులకు కూడా బెనిఫిట్స్ ఇవ్వాలి. పోలీసులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా హోమ్ గార్డులకు కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. హోమ్ గార్డుల నియామకాలు వెంటనే చేపట్టాలి. ఉద్యోగులకు డిమాండ్లు పరిస్కారం చేయాలి.హోమ్ గార్డులకు వారి అసోసియేషన్ ఉండాలి అని డీజీపీ కార్యాలయంలో రూమ్ ఉండాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు రూమ్ తాళాలు ఇవ్వడం లేదు హోమ్ గార్డులను వేధిస్తే చూస్తూ ఊరుకోమని శ్రీనివాస్ గౌడ్ హెచ్చారించారు. స్పెషల్ పోలీస్ లను కూడా ఇదే విదంగా వేధించారని. కొంతమంది కానిస్టేబుల్ లను సస్పెండ్ చేశారు. వాళ్ళను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News