'ఉపాధి' ఉద్యోగులకు గ్రీన్ చానల్ లో జీతాలు
పెండింగ్ వేతనాలు చెల్లించాలని అధికారులకు సీఎం ఆదేశం
Advertisement
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులకు గ్రీన్ చానల్‌లో జీతాలు చెల్లించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉద్యోగులకు ఇప్పటికే పెండింగ్ లో ఉన్న వేతన బకాయిలు పూర్తి చెల్లించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్నట్టుగానే ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న గ్రామ స్థాయి ఉద్యోగులకు కూడా ప్రతి నెల జీతాలు చెల్లించాలని తేల్చిచెప్పారు. ఉపాధి హామీ పథకంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు చెల్లించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Advertisement