సంక్రాంతి నుంచి రైతుభరోసా
జనవరి నాటికి రైతుబంధు విధివిధానాలు రూపకల్పన చేస్తామన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.అసెంబ్లీలో నేడు రైతుభరోసా విధివిధానాలపై స్వల్పకాలిక చర్చ జరగనున్నది.మండలి ముందుకు జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల సవరణ, పంచాయతీరాజ్ సవరణ, భూభారతి సవరణ బిల్లులు రానున్నాయి.హైదరాబాద్ అభివృద్ధిలో ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్,మహాలక్ష్మి పథకం అమల్లో విఫలమైన తీరుపై చర్చించాలని బీజేపీ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీపీఐ వాయిదా తీర్మానం ఇచ్చాయి.అసెంబ్లీ పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కావడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. రోజూ ఆలస్యంగా సభ ప్రారంభవుతున్నదని సభ సమయపాలన పాటించాలన్నారు. అందరికీ ఆదర్శంగా మనం ఉండాలని సూచించారు. సభ ఇలా ఆలస్యంగా జరిగితే ఎలా అని నిలదీశారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుభరోసా విధివిధానాల గురించి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రారంభించింది. ధరణి పోర్టల్ లో ఉన్న వివరాల ప్రకారం రైతుబంధు ఇచ్చారు. రైతు బంధు కింద ఇప్పటివరకు రూ. 80,453 కోట్లు ఇచ్చారు. 2018 నుంచి పంటల సర్వే వ్యవసాయ శాఖ బాధ్యతగా మారిందన్నారు. ఏఈవోలు యాప్ లు సాయంతో పంటల నగదు సర్వే ప్రారంభించారు. రూ. 21283.66 కోట్ల రైతుబంధు నిధులు.. సాగు చేయని భూముల కోసం విడుదలైందన్నారు. సంక్రాంతి నుంచి రైతుభరోసా నిధులు విడుదల చేస్తామన్నారు. జనవరి నాటికి రైతుబంధు విధివిధానాలు రూపకల్పన చేస్తామన్నారు.