వేములవాడకు రూ.127.65 కోట్లు

ఆలయ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, ఇతర పనులకు నిధులు

Advertisement
Update:2024-11-18 14:36 IST

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధితో పాటు పలు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.127.65 కోట్లు మంజూరు చేసింది. సోమవారం ఈమేరకు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.50 కోట్లతో వేములవాడ ఆలయ విస్తరణ, భక్తులకు అధునాతన సదుపాయాలతో కూడిన వసతులు కల్పించడం సహా ఇతర పనులు చేపట్టనున్నారు. రూ.26 కోట్లతో స్థానికంగా గుర్తించిన ఇతర అభివృద్ధి పనులు చేస్తారు. వేములవాడ రాజన్న ఆలయం నుంచి మూలవాగు బిడ్రి వరకు రోడ్డు విస్తరణ, భవనాలు, ఖాళీ స్థలాల సేకరణ కోసం రూ.రూ.47.85 కోట్లు మంజూరు చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఈనెల 20న వేములవాడ పర్యటనకు వెళ్తున్నారు. ఈనేపథ్యంలోనే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో చేపట్టబోయే పనులకు ఈ పర్యటనలో సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మొదట వేములవాడ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత గుడి చెరువు మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడుతారు.

Tags:    
Advertisement

Similar News