ఒక్క గేట్ మార్చడానికి రూ.4 కోట్లు.. ఇదే కాంగ్రెస్ మార్క్ మార్పు
రేవంత్ వాస్తు పిచ్చిపై మాజీ మంత్రి హరీశ్ సెటైర్లు
వాస్తు దోషం ఉందని సెక్రటేరియ్ లోని ఒక్క గేట్ మార్చడానికి రూ.4 కోట్లు ఖర్చు చేస్తున్నరు.. ఇది కదా అసలు సిసలైన కాంగ్రెస్ మార్క్ ''మార్పు'' అంటే మాజీ మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. గ్రీన్ టెక్నాలజీతో, ఫైర్ సేఫ్టీ నార్మ్స్ తో దేశానికే తలమానికంగా కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ నిర్మిస్తే వాస్తు పిచ్చి అని గాయి గాయి.. గత్తర గత్తర చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వాస్తు పిచ్చితో సెక్రటేరియట్ లో పూటకో మార్పు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మార్క్ మార్పు అంటే ఇదేనని.. ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని తేల్చేశారు. సెక్రటేరియట్ సింహద్వారం మార్పు, రెండు గేట్లను అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తుండటంపై మండిపడ్డారు. రేవంత్ వాస్తు పిచ్చితో ప్రజాధనం వృథా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.