RRR కి అవార్డ్.. బండి సంజయ్ సారీ చెప్పాలంటూ ట్రోలింగ్

ఎలాగోలా తాను లైమ్ లైట్లోకి రావాలనే ఉద్దేశంతోనే ఆర్ఆర్ఆర్ పై ఉమ్మేయాలనే ప్రయత్నం చేశారు సంజయ్. అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. అది కల్పిత పాత్రల సినిమా అంటూ నచ్చజెప్పాలని చూసినా, మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రెచ్చిపోయారు సంజయ్.

Advertisement
Update:2023-01-12 06:35 IST

RRR సినిమాలో నాటు-నాటు పాటకి అవార్డ్ రావడంతో సోషల్ మీడియా హోరెత్తింది. సినిమా టీమ్ కి శుభాకాంక్షలు చెబుతూ అందరూ ట్వీట్లు వేశారు. అయితే అందులో బండి సంజయ్ ట్వీట్ కాస్త స్పెషల్. ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ ని మెచ్చుకుంటూ ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలో సినిమా టీజర్ రిలీజ్ టైమ్ లో బండి చేసిన ఓవర్ యాక్షన్ ని ఇప్పుడు అందరూ గుర్తు చేస్తున్నారు. బండిని నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇప్పటికైనా రాజమౌళికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

అప్పుడేమన్నారు..?

“బిడ్డా రాజమౌళీ..! నువ్వు సినిమా రిలీజ్ చేస్తే.. బరిసెలతో తరిమి తరిమి కొడతాం..

పాతబస్తీ నాయకుడికి తిలకం పెట్టగలవా..? నిజాంకి కాషాయ కండువా కప్పి సినిమా తీయగలవా..?

కొమురం భీమ్ ని కించపరిచావ్, మా మనోభావాలు దెబ్బతీశావ్..!

ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేస్తే థియేటర్లు తగలబెడతాం..”

ఇవీ అప్పట్లో బండి సంజయ్ ఆవేశంలో చెప్పిన మాటలు. ఎలాగోలా తాను లైమ్ లైట్లోకి రావాలనే ఉద్దేశంతోనే ఆర్ఆర్ఆర్ పై ఉమ్మేయాలనే ప్రయత్నం చేశారు సంజయ్. అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. అది కల్పిత పాత్రల సినిమా అంటూ నచ్చజెప్పాలని చూసినా, మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రెచ్చిపోయారు సంజయ్.

ఇప్పుడేమంటున్నారు..?

ఆయన మనోభావాలు ఏమేర దెబ్బతిన్నాయో... ఆమధ్య ఎన్టీఆర్-అమిత్ షా భేటీ దగ్గరే తేలిపోయింది. కొమురం భీమ్ క్యారెక్టర్ వేసిన ఎన్టీఆర్ దగ్గర ఒంగి ఒంగి వినయం ప్రదర్శించారు సంజయ్. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కి అవార్డ్ రావడంతో మరోసారి ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పి నవ్వులపాలయ్యారు. RRR టీమ్ కి శుభాకాంక్షలు చెబుతూ భారత దేశం గర్వించేలా చేశారంటూ మెచ్చుకున్నారు. మరి అదే నోటితో ఆనాడు దర్శకుడు రాజమౌళిని బరిశెలతో తరిమి కొడతామన్నావ్ కదా బండీ అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.


శుభాకాంక్షలు చెప్పడం మంచిదే కానీ తన తప్పు తెలుసుకున్నానని, అప్పటి మాటలకు చింతిస్తున్నానంటూ క్షమాపణలు చెప్పాలంటూ బండిని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. రాజమౌళికి, ఎన్టీఆర్ కి క్షమాపణలు చెప్పనంత వరకు బండి సంజయ్ లాంటివారు ఎన్ని శుభాకాంక్షలు చెప్పినా ఫలితం లేదంటున్నారు.

Tags:    
Advertisement

Similar News