రేవంత్ వర్సెస్ కేటీఆర్.. పుట్టినరోజు ట్వీట్లు కూడా ఆసక్తికరం

తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్టర్ లో రిప్లై ఇస్తున్నారు కేటీఆర్. తెలంగాణ సీఎంఓ ట్వీట్ కి మాత్రం ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు.

Advertisement
Update:2024-07-24 09:56 IST
రేవంత్ వర్సెస్ కేటీఆర్.. పుట్టినరోజు ట్వీట్లు కూడా ఆసక్తికరం
  • whatsapp icon

సహజంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే ఎవరైనా థ్యాంక్స్ అని చెబుతారు, కానీ కేటీఆర్ మాత్రం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పి సరిపెట్టలేదు, మరో ఆసక్తికర సమాధానమిచ్చారు. "మెనీ థ్యాంక్స్ రేవంత్ రెడ్డిగారు.." అంటూనే "అప్రిసియేట్ ద గ్రీటింగ్స్" అంటూ ట్విస్ట్ ఇచ్చారు. తనకు శుభాకాంక్షలు చెప్పినందుకు సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నట్టు తెలిపారు.


ఇంతకీ రేవంత్ ట్వీట్ ఏంటి..?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. "హ్యాపీ బర్త్ డే కేటీఆర్" అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ట్వీట్ వేయలేదు. తెలంగాణ సీఎంఓ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ ట్వీట్ పడింది. కేటీఆర్ జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారని, నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు కేటీఆర్ కి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రేవంత్ ఆకాంక్షించారనేది ఆ ట్వీట్ సారాంశం.

తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్టర్ లో రిప్లై ఇస్తున్నారు కేటీఆర్. తెలంగాణ సీఎంఓ ట్వీట్ కి మాత్రం ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. థ్యాంక్స్ చెప్పడంతోపాటు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలను అభినందిస్తున్నట్టు చెప్పడం విశేషం. 

Tags:    
Advertisement

Similar News