తెలంగాణలో రేవంత్‌ దొంగల ముఠా పడ్డది

కంపెనీలను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ డబ్బులు వసూలు చేస్తోంది : కేటీఆర్‌

Advertisement
Update:2025-01-17 17:02 IST

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి దొంగల ముఠా పడ్డదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్‌ చేశారు. రేవంత్‌ రెడ్డి తన సోదరులతో పాటు ఆరుగురు సభ్యులున్న ముఠాను రాష్ట్రం మీదికి వదిలారని చెప్పారు. తిరుపతి రెడ్డి, కొండల్‌ రెడ్డి, వేం నరేందర్‌ రెడ్డి, రోహిన్‌ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏవీ రెడ్డిలతో కూడిన ఆలీబాబా అరడజన్‌ దొంగల గ్యాంగ్‌ రాష్ట్రంలో తిరుగుతూ బెదిరింపులు, బ్లాక్‌ మెయిలింగ్‌ కు తెగబడుతుందని చెప్పారు. కంపెనీలను బెదిరించి, బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేయడం.. కబ్జాలకు పాల్పడటం.. భూదందాలు చేయడం ఈ ముఠా పని అని చెప్పారు. ఈ ముఠా బ్లాక్‌మెయిలింగ్‌, భూ దందాలను పక్కదారి పట్టించడానికే రేవంత్‌ రెడ్డి అనేక అంశాలను తెరమీదికి తెస్తున్నాడని చెప్పారు. ఆరు గ్యారంటీలను అమలు చేశామని రేవంత్‌ చెప్పడం ఈ ఏడాదికే పెద్ద జోక్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ముమ్మాటికీ అన్ని వర్గాల పార్టీ అన్నారు. హెగ్డేవార్‌ ను పొగిడిన రేవంత్‌ రెడ్డినే అసలు సిసలైన ఆర్‌ఎస్‌ఎస్‌ మనిషి అన్నారు. ఏబీవీపీలో పని చేసి.. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పని చేసింది రేవంత్‌ రెడ్డినేనని గుర్తు చేశారు. ఆయన గతంలో వేసుకున్న నిక్కర్‌ కలర్‌ ఖాకీ అని గతంలో అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారని గుర్తు చేశారు.

Tags:    
Advertisement

Similar News