సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల టూర్‌.. సెంటిమెంట్‌గా అక్కడే తొలి సభ

ఈ నెల 26 తర్వాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని.. వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సెక్రటేరియట్‌లో అందుబాటులో ఉంటానని చెప్పారు.

Advertisement
Update:2024-01-09 10:33 IST

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆదివారం 5 జిల్లాల మంత్రులతో సమావేశమైన సీఎం.. ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. మొదటగా ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లిలో ముఖ్యమంత్రిగా తొలిసభలో పాల్గొననున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఇంద్రవెల్లిలోనే తొలి సభ నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఇదే సెంటిమెంట్‌ను ఇప్పుడు కూడా ఫాలో కానున్నారు.

ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్మృతి వనం ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని నేతలను, అధికారులను ఆదేశించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామన్నారు.

ఈ నెల 26 తర్వాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని.. వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సెక్రటేరియట్‌లో అందుబాటులో ఉంటానని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని నేతలకు సూచించారు రేవంత్ రెడ్డి. 12 ఎంపీ స్థానాలు గెలవాలని.. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించాలని టార్గెట్ పెట్టారు.

Tags:    
Advertisement

Similar News