ఐడీ దాడులపై రేవంత్ రెడ్డి ఘాటు రియాక్షన్

సరిగ్గా ఎన్నికల వేళ ఐటీ దాడులు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. అందులోనూ వైరి వర్గాలను టార్గెట్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడులుగా వీటిని అభివర్ణిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

Advertisement
Update:2023-11-09 11:12 IST

తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమైందని, అందుకే మోడీ బెంబేలెత్తిపోతున్నారని, ఐటీ దాడులకు అధికారుల్ని ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

"నేడు పొంగులేటి, నిన్న తుమ్మల,

అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం!?

బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!?

రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ బెంబేలెత్తుతున్నారు.

ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది.

ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను.

నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం." అంటూ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.


సరిగ్గా ఎన్నికల వేళ ఐటీ దాడులు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. అందులోనూ వైరి వర్గాలను టార్గెట్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడులుగా వీటిని అభివర్ణిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల వేళ ప్రత్యర్థుల్ని బెదిరించడానికి, వారి విజయావకాశాలను దెబ్బతీయడానికే ఈ దాడులు చేస్తున్నారని అంటున్నారు. ఓటమి ఖాయమని తేలినందుకే బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగగా, నేడు పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో సోదాలు మొదలయ్యాయి. ఎనిమిదికిపైగా వాహనాల్లో ఐటీ అధికారులు ఖమ్మం చేరుకుని పొంగులేటీ ఆఫీస్‌, ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. పొంగులేటి అనుచరులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈరోజే ఆయన నామినేషన్ కు ఏర్పాట్లు చేసుకున్నారు. రేపటితో నామినేషన్లకు గడువు పూర్తవుతుంది. ఈ దశలో ఐటీ దాడులతో పొంగులేటిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన అభిమానులంటున్నారు. 


Tags:    
Advertisement

Similar News