ఎంపీ ఎన్నికలు నా పాలనకు రెఫరెండం - రేవంత్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తేనే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7 తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించి.. జాతీయ స్థాయిలో ఆరు గ్యారంటీలను ప్రకటించబోతున్నామని చెప్పారు రేవంత్.

Advertisement
Update:2024-03-26 15:28 IST

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 17లో 14 ఎంపీ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికలు 100 రోజుల ప్రభుత్వ పాలనకు రెఫరెండం అన్నారు. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు రేవంత్‌. సర్వేలు, స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఎంపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ నియోజకవర్గాలకు ఒకదానితో మరొకదానికి సంబంధం ఉందన్నారు.

పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు రేవంత్. గుజరాత్‌కు బుల్లెట్‌ ట్రైన్‌ తీసుకెళ్తున్న మోదీ.. వికారాబాద్‌కు కనీసం MMTS ట్రైన్‌ తీసుకురాలేదన్నారు. ప్రాణహిత పూర్తి చేయలేదన్నారు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్‌ను డెవలప్ చేసిన మోదీ.. మూసీ రివర్‌ ఫ్రంట్‌కు మాత్రం నిధులివ్వలేదన్నారు. ఏం చూసి మోదీకి ఓటేయ్యాలని ప్రశ్నించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తేనే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7 తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించి.. జాతీయ స్థాయిలో ఆరు గ్యారంటీలను ప్రకటించబోతున్నామని చెప్పారు రేవంత్. రంగారెడ్డి జిల్లా నుంచి జాతీయ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నామని చెప్పారు. ఈ సభకు రాహుల్‌ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే హాజరవుతారన్నాని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News