రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయం : దాసోజు శ్రవణ్
మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్స్ తరువాత రేవంత్ కుర్చీ ఊడిపోవడం ఖాయమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు
మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్స్ తరువాత రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఊడిపోవడం ఖాయమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. రేవంత్‌రెడ్డిని పీకి పడేయబోతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నాడని పేర్కొన్నారు.పేద ప్రజలను అణగదొక్కుతూ.. వాళ్ల జీవితాలను నాశనం చేస్తూ ఇండ్లను నాశనం చేస్తూ కూల్చివేతలకు పాల్పడుతూ బుల్డోజర్ పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి కుర్చీ ప్రమాదంలో ఉందని తెలిపారు. సోనియాగాంధీ కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవడం కాదు.. తీర్థం తాగు అన్నారు.
రేవంత్ రెడ్డి లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హుడే కాడు. సోనియాగాంధీ వల్లనే రేవంత్ లాంచి ఛిచోర వ్యక్తి సీఎం అయిండు అన్నారు. దమ్ముంటే కొడంగల్ లో రాజీనామా చేసి గెలువు బిడ్డ అని సవాల్ విసిరారు దాసోజు శ్రవణ్. అలాగే దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలువు రేవంత్ రెడ్డి అంటూ సీఎంకు సవాల్ విసిరారు దాసోజు శ్రవణ్. నిన్ను లగచర్ల బాధితులు లగాయించి కొడుతారు. కొడంగల్ లో రాజీనామా చేసి గెలిచే దమ్ముందా అంటూ ఛాలెంజ్ చేసారు.