పనితీరే గీటురాయి.. చైర్మన్ పదవులపై రేవంత్ రెడ్డి

మూసీ నది ప్రక్షాళణ అనే ఆలోచన కూడా వైఎస్ఆర్ స్ఫూర్తితోనే వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి.

Advertisement
Update:2024-07-08 13:24 IST

వివిధ కార్పొరేషన్లకు తాజాగా చైర్మన్లను ఎంపిక చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ పదవుల ప్రకటనతో సందడి మొదలైంది. వారి పనితీరు గుర్తించే ఆయా పదవులకు ఎంపిక చేసినట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం కృషి చేసిన వారికే పదవులు వరించాయన్నారు. వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఘన నివాళులర్పించారు.


ఆనాడు వైఎస్ చలవతో..

నాడు వైఎస్ఆర్ పాదయాత్ర వల్లే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాగలిగిందని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కి తిరిగి అధికారం దక్కిందన్నారు. రాహుల్ ని ప్రధానిగా చూడాలనేదే వైఎస్ఆర్ జీవితాశయం అని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. ఆయన ఆశయానికి, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెళ్లేవారు వైఎస్ఆర్ వారసులు కాదని పరోక్షంగా జగన్ కి చురకలంటించారు. వైఎస్ఆర్ స్ఫూర్తితో రాహుల్ ని ప్రధానిని చేసే విధంగా ముందుకెళ్తామన్నారు రేవంత్ రెడ్డి. మూసీ నది ప్రక్షాళణ అనే ఆలోచన కూడా వైఎస్ఆర్ స్ఫూర్తితోనే చేపట్టామన్నారాయన.

ఈ ఏడాది వైఎస్ఆర్ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కావడంతో ఏపీలో కూడా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ వద్దనున్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.

Tags:    
Advertisement

Similar News