ఇంకా నయం 25గంటలు అనలేదు.. రేవంత్ పై పేలుతున్న జోకులు

3 గంటలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు 24గంటలు ఇస్తామనడమేంటని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆల్రడీ తెలంగాణలో 24గంటల విద్యుత్ ఇస్తున్నామని ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ వచ్చి చేసేదేంటని నిలదీస్తున్నారు.

Advertisement
Update:2023-11-08 17:07 IST

తెలంగాణ ఎన్నికల్లో 24గంటల ఉచిత విద్యుత్ అనే అంశం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. రేవంత్ రెడ్డి 3 గంటల విద్యుత్ సరిపోతుందన్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల గతి అధోగతి అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇన్నాళ్లూ ఈ ఆరోపణలను కాంగ్రెస్ కూడా లైట్ తీసుకుంటోంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కి కౌంటర్లు రెడీ చేసింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్వయంగా వివరణలు ఇచ్చుకుంటున్నారు. అసలు తాను విద్యుత్ గురించి ఎక్కడ మాట్లాడానని ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెబుతున్నారు.

3 గంటలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు 24గంటలు ఇస్తామనడమేంటని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆల్రడీ తెలంగాణలో 24గంటల విద్యుత్ ఇస్తున్నామని ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ వచ్చి చేసేదేంటని నిలదీస్తున్నారు. తమకంటే గొప్పగా చేస్తామని చెప్పే క్రమంలో రేవంత్ రెడ్డి రోజుకి 25గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని కూడా హామీ ఇవ్వొచ్చని జోకులు పేలుస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ పంపిణీ ఎలా ఉందో అందరికీ తెలుసని, కరెంటు కోతలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు.

రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో కరెంటు కష్టాలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. 24 గంటల విద్యుత్ ఎక్కడా అమలు కావడంలేదని అంటున్నారు. సబ్ స్టేషన్లకు వెళ్లి అడుగుదామని 24గంటల కరెంటు రైతులకు ఇస్తున్నారంటే తాను నామినేషన్ కూడా వేయబోనని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. మొత్తమ్మీద తెలంగాణ ఎన్నికల్లో 24గంటల ఉచిత విద్యుత్ అనే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కర్నాటకలో రైతులకు కేవలం 5 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తున్న కాంగ్రెస్, తెలంగాణలో మాత్రం 24గంటలు ఇస్తామని చెప్పడం విశేషం. 


Tags:    
Advertisement

Similar News