రేవంత్ ప్లాన్ A, ప్లాన్ B.. షాకింగ్ నిజాలు చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే
రేవంత్ కు పోటీగానే 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఉత్తమ్ కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో కంఫర్ట్ లేదు. సొంత దుకాణం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు BJLP నేత, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి. కాంగ్రెస్‌లో ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ అంటూ మూడు గ్రూపులు ఉన్నాయన్నారు. 25 మందితో తన వర్గం ఎమ్మెల్యేలకు తోడుగా BRS ఎమ్మెల్యేలను తెచ్చుకోవాలని రేవంత్ చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి దగ్గర రెండు ప్లాన్లు ఉన్నాయి. ప్లాన్ A అంటే పార్టీలో ఉంటే నా వెంట ఎంత మంది వస్తారు ? ప్లాన్ B అంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా దుకాణం పెట్టుకుంటే ఎంత మంది వస్తారు ?" ఇలా కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మహేశ్వర్‌రెడ్డి.
"రేవంత్ కు పోటీగానే 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఉత్తమ్ కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో కంఫర్ట్ లేదు. సొంత దుకాణం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా సీఎం చెబుతున్నారు. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని స్వయంగా రేవంత్ అంటున్నారు. సీఎం స్థాయిలో ఉండి కుట్ర చేస్తున్నారని రేవంత్ అంటున్నారు. గేట్లు ఓపెన్ చేసినా... విండో లు ఓపెన్ చేసినా ఎవరు కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదు".
"మేము గేట్లు ఎత్తే అవసరం లేదు. ఉప ఎన్నికలు వస్తే జై శ్రీరామ్ అంటాం. కాంగ్రెస్ పార్టీని ఎవరు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు... వాళ్ళ మధ్య విభేదాలే వాళ్ళను వీక్ చేస్తాయి. మా ఎమ్మెల్యేలు ఎవరితో టచ్ లో లేరు. బీజేపీ ప్రజలను నమ్ముకుంది. కాంగ్రెస్ పార్టీలో 5 గురు షిండేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు.. ప్రభుత్వం కూలిపోతుంది". ముఖ్యమంత్రి వెంట భారీ వ్యవస్థ ఉన్నప్పటికీ కుట్ర జరుగుతుందని రేవంత్ అనడం ఆయన అసమర్థతకు నిదర్శనం అన్నారు మహేశ్వర్‌రెడ్డి.