హరితహారం కాదు.. ఇకపై ఇందిర వనప్రభ

రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కీలక పథకాల పేర్లను మార్చింది. రైతుబంధును రైతు భరోసాగా, ధరణి పోర్టల్‌ పేరును భూమాత పోర్టల్‌గా, డబుల్‌ బెడ్రూం ఇళ్ల స్కీమ్‌ పేరు ఇందిరమ్మ ఇండ్లుగా మార్చింది.

Advertisement
Update:2024-05-31 09:21 IST

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో పథకానికి పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం తెలంగాణలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెట్లు నాటే కార్యక్రమం హరితహారం పేరును రేవంత్ సర్కార్‌ ఇందిర వనప్రభగా మార్చనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

తెలంగాణలో అడవుల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా 2015 జులై 3న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులో హరితహారం పథకాన్ని ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. గడిచిన 9 ఏళ్లలో ఈ పథకం కింద దాదాపు 280 కోట్లకుపైగా మొక్కలు నాటినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. గ్రామాల్లో ఈ స్కీమ్‌ కింద నర్సరీలతో పాటు ప్రకృతివనాలను ఏర్పాటు చేశారు.

రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కీలక పథకాల పేర్లను మార్చింది. రైతుబంధును రైతు భరోసాగా, ధరణి పోర్టల్‌ పేరును భూమాత పోర్టల్‌గా, డబుల్‌ బెడ్రూం ఇళ్ల స్కీమ్‌ పేరు ఇందిరమ్మ ఇండ్లుగా మార్చింది. ఇక కేసీఆర్‌ కిట్‌ పేరును మదర్ అండ్ చైల్డ్ హెల్త్‌గా మారిపోయింది. ఇక కల్యాణలక్ష్మి స్కీమ్‌కు సైతం కొత్త పేరు పెట్టే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కార్.

Tags:    
Advertisement

Similar News