KCR బహిరంగ సభ.. రేవంత్ సర్కార్ షాకింగ్ డెసిషన్..!
చట్టం ప్రకారం పోలీసు అధికారుల ముందస్తు అనుమతి తీసుకోకుండా.. జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించొద్దని ఎస్పీ సూచించారు.
కృష్ణా ప్రాజెక్టులు KRMBకి అప్పగింతపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే అంశంపై నల్గొండ జిల్లాలో ఫిబ్రవరి 3 వారంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది బీఆర్ఎస్. ఈ సభ ద్వారా కేసీఆర్ రీఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. దాదాపు 2 లక్షల మందితో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది బీఆర్ఎస్.
నల్గొండ జిల్లాకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో నెల రోజుల పాటు 30, 30A పోలీస్ యాక్ట్ - 1861 అమలులోకి తెచ్చింది. ఈ మేరకు ఎస్పీ చందనా దీప్తి ప్రకటన విడుదల చేశారు.
ఈ చట్టం ప్రకారం పోలీసు అధికారుల ముందస్తు అనుమతి తీసుకోకుండా.. జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించొద్దని ఎస్పీ సూచించారు. కేసీఆర్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేయడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యాక్ట్ అమల్లోకి తెచ్చిందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బహిరంగ సభ నిర్వహించి తీరుతామని చెప్తున్నారు.