ఓయూలోని రెండు మెట్ల బావుల పునరుద్దరణ.. విద్యార్థులతో కలిసి హెచ్ఎండీఏ స్పెషల్ డ్రైవ్

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కలిసి గోల్కొండ, బన్సీలాల్‌పేటలోని మెట్ల బావులను పునరుద్దరించాయి. కొన్నాళ్ల క్రితం మున్సిపల్ మంత్రి కేటీఆర్ వీటిని ప్రారంభించగా.. ఇప్పుడు మంచి టూరిస్ట్ స్పాట్‌లుగా మారాయి.

Advertisement
Update:2023-04-04 08:24 IST

తెలంగాణ ప్రభుత్వం, హెచ్ఎండీఏ కలిసి హైదరాబాద్ నగరంలోని సాంస్కృతిక సంపదను కాపాడే చర్యలు తీసుకుంటోంది. గతంలో నగరంలో అనేక మెట్ల బావులు ఉండేవి. ప్రజల దాహర్తిని తీర్చేందుకు అప్పటి పాలకులు ఈ బావులను నిర్మించారు. కాలక్రమేనా కొన్ని బావులు కనుమరుగు కాగా, మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. అయితే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కలిసి గోల్కొండ, బన్సీలాల్‌పేటలోని మెట్ల బావులను పునరుద్దరించాయి. కొన్నాళ్ల క్రితం మున్సిపల్ మంత్రి కేటీఆర్ వీటిని ప్రారంభించగా.. ఇప్పుడు మంచి టూరిస్ట్ స్పాట్‌లుగా మారాయి.

వీటిని స్పూర్తిగా తీసుకొని కొంత మంది విద్యార్థులు, పలు సంస్థలకు చెందిన వలంటీర్లు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లోని రెండు మెట్ల బావులను పునరుద్దరణ చేపట్టారు. సోమవారం 100 మంది ఈ బావుల పునరుద్దరణకు శ్రమదానం చేశారు. ఈ మెట్ల బావుల పునరుద్దరణను 'ది రెయిన్ వాటర్ ప్రాజెక్ట్' బృందం లీడ్ చేస్తోంది. అడిక్‌మెట్ బస్టాప్ సమీపంలోని మెట్ల బావి పండ్ల వ్యాపారులు వేసిన చెత్తతో నిండిపోయింది. ఇక యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఉన్న బావి పిచ్చి మొక్కలు, తుప్పలతో ఉన్నది. ముందుగా ఈ రెండు మెట్ల బావుల్లో నుంచి చెత్త చెదారాన్ని తొలగించారు. ఆ తర్వాత పిచ్చి మొక్కలు, తుప్పలు, చిన్న చెట్లను తొలగించారు. వీరికి స్థానికులు కూడా సహకరించారు.

వలంటీర్లు ఈ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత హెచ్ఎండీఏ పూడిక తీత బాధ్యతలు చేపట్టనున్నది. ఆ తర్వాత వారి ఆధ్వర్యంలోనే రిస్టోరేషన్ పనులు చేయనున్నారు. బన్సీలాల్‌పేట స్టెప్ వెల్ రిస్టోరేషన్‌లో కూడా ది రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ పాలు పంచుకున్నట్లు కల్పన రమేశ్ చెప్పారు. కాగా, ఈ మెట్ల బావుల పునరుద్దరణలో నిర్మాణ శైలిని కాపాడటమే అతిపెద్ద ఛాలెంజ్ అని చెప్పారు. అంతే కాకుండా ఫండ్స్ కూడా కలెక్ట్ చేయడం కష్టమే.. కానీ హెచ్ఎండీఏ ఇందుకు సహకరిస్తోందని చెప్పారు. ఇక ఈ రెండు మెట్ల బావుల పునరుద్దరణ తర్వాత ఇఫ్లూ క్యాంపస్‌ను ఆనుకొని ఉన్న మరో రెండు మెట్ల బావులను కూడా పునరుద్దరించనున్నట్లు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News