దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట
దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై నిర్వాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై నిర్వాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అభ్యంతరాలను పరిశీలించాలని అబ్జెక్షన్స్పై పై లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించారు. దుర్గం చేరువు నిర్వాసితులు ఆక్టోబర్ 4న పరిరక్షణ కమీటీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దుర్గం చెరువు అక్రమణ పరిధిలోని నివాసితుల్లో ముఖ్యమంత్రి సోదురుడు తిరుపతి రెడ్డి ఉండటం గమనార్హం. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తూ వస్తున్న హైడ్రా.. ఎనుముల తిరుపతి రెడ్డి ఇల్లు, కార్యాలయంతో సహా పలు ప్రముఖుల నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిని 30 రోజుల్లోగా తొలగించాలని నోటీసులు అంటించారు.
దీంతో కూల్చివేత నోటీసులను సవాల్ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు హైదరాబాద్‌లో ఇవాళ హైడ్ర కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాదాపూర్‌లో కావేరి హిల్స్ పార్క స్ధలంలో వెలసిన అక్రమ షెడ్లను కూల్చివేశారు. . శని, ఆదివారం వస్తుందంటే హైదారాబాద్‌లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీఆర్‌ఎస్ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారని చెప్పారు. కూకట్‌పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతలపై ఆయన మీడియాతో మాట్లాడారు. వారాంతాల్లో హైడ్రా కాదు హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు.